మరోసారి రూపాయి విలువ పతనం.. డాలర్తో పోలిస్తే 90.07కి చేరిక
హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.) మరోసారి రూపాయి విలువ పతనం అయింది. ఈ రోజు ప్రారంభ ట్రేడింగ్లో భారత రూపాయికి ఒత్తిడి ఎదురైంది. అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 12 పైసలు పడిపోయి.. 90.07 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్కు డిమాండ
రూపాయి పతనం


హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.)

మరోసారి రూపాయి విలువ పతనం

అయింది. ఈ రోజు ప్రారంభ ట్రేడింగ్లో భారత రూపాయికి ఒత్తిడి ఎదురైంది. అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 12 పైసలు పడిపోయి.. 90.07 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్కు డిమాండ్ పెరగడం, దిగుమతిదారులు, కార్పొరేట్ల నుండి పెరుగుతున్న డాలర్ కొనుగోళ్లు రూపాయి బలహీనపడటానికి ప్రధాన కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (Flls) నిధులను ఉపసంహరించుకోవడం కూడా రూపాయిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande