బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోంది.. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
న్యూఢిల్లీ, 8 డిసెంబర్ (హి.స.) పార్లమెంట్ లో వందేమాతరం జాతీయ గీతం వందేమాతరంపై చర్చ సందర్భంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఢిల్లీ లో మీడియాతో మాట్లాడుతూ.. 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ దేశ ప్రజల కోసం కాంగ్రెస్
భువనగిరి ఎంపీ


న్యూఢిల్లీ, 8 డిసెంబర్ (హి.స.)

పార్లమెంట్ లో వందేమాతరం జాతీయ గీతం వందేమాతరంపై చర్చ సందర్భంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఢిల్లీ లో మీడియాతో మాట్లాడుతూ.. 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ దేశ ప్రజల కోసం కాంగ్రెస్ సెషన్స్లో వందేమాతరం పాడారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసీసీ (AICC), పీసీసీ (PCC), డీసీసీ (DCC) మీటింగ్స్ వందేమాతరం గీతాన్ని పాడతామని పేర్కొన్నారు. కానీ, బీజేపీ నాయకులు తమ పార్టీ కార్యక్రమాలు, ఆర్ఎస్ఎస్ మీటింగ్స్లో జాతీయ గీతాన్ని ఆలపించరని ఆరోపించారు. అకస్మాత్తుగా బీజేపీ వందేమాతరంపై పార్లమెంట్లో చర్చ పెట్టి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూలను చెడుగా చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande