వినూత్న రీతిలో సైబర్ నేరాలు చీమకుర్తి లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
చీమకుర్తి, 8 డిసెంబర్ (హి.స.) , :సైబర్‌ నేరాలు)కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆపదలో ఉన్నాడని పాపం తలచి ఫోన్‌ ఇస్తే అకౌంట్లలోని నగదును కాజేసే వినూత్న సైబర్‌ నేరాలకు పాల్పడేవారు తారసపడుతున్నారు. ముఖ్యంగా వయస్సు మళ్లిన వారు కీప్యాడ్‌ ఫోన్లు వాడుతుంటారు
వినూత్న రీతిలో సైబర్ నేరాలు చీమకుర్తి లో పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు


చీమకుర్తి, 8 డిసెంబర్ (హి.స.)

, :సైబర్‌ నేరాలు)కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆపదలో ఉన్నాడని పాపం తలచి ఫోన్‌ ఇస్తే అకౌంట్లలోని నగదును కాజేసే వినూత్న సైబర్‌ నేరాలకు పాల్పడేవారు తారసపడుతున్నారు. ముఖ్యంగా వయస్సు మళ్లిన వారు కీప్యాడ్‌ ఫోన్లు వాడుతుంటారు. అలాంటి వారిని లక్ష్యంగా చేసుకొని వారి వద్ద నుంచి అర్జంట్‌గా ఒక కాల్‌ చేసుకుంటానని ఫోన్‌ తీసుకొని వారి బ్యాంకు అకౌంట్ల నుంచి నగదును కాజేసిన సైబర్‌ నేరగాడిన చీమకుర్తి పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను శనివారం చీమకుర్తి పోలిస్‌స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఐ దాసరి ప్రసాద్‌ తెలియజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande