
హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.)
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా
నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్'నేటి మధ్యాహ్నం అట్టహాసంగా ప్రారంభం అయింది. ఈ సమ్మిట్ కు హాజరయ్యేందుకు ప్రతినిధులు, అతిధులు, ప్రముఖులంతా ఫ్యూచర్ సిటీకి చేరుకుంటున్నారు. దీంతో శంషాబాద్ బెంగుళూరు మార్గంలో వాహనాల రద్దీ భారీగా పెరిగింది. కాగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులతోపాటు మొత్తం రెండు వేలమంది దేశ-విదేశాల ప్రముఖ అతిథులు పాల్గొననున్నారు.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమ్మిట్ ను ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు, ప్రజాపాలన, విజన్ 2047 లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై వివరించారు. సమిట్కు హాజరయ్యే జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల కోసం భద్రత, లైజనింగ్, యాక్సెస్ పాస్లు సహా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..