బిల్డప్ బాబాయ్ రేవంత్ రెడ్డి.. ఏం మాట్లాడినా అబద్ధమే: హరీశ్ రావు
హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.) రేవంత్ రెడ్డి బిల్డప్ బాబాయ్ అని, ఆయన ఏం మాట్లాడినా అబద్ధమే అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రెండేండ్ల పాలనలో దోపిడీ తప్ప పారదర్శక లేదని, ఆత్మస్తుతి, పరనింద తప్ప రేవంత్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. ముఖ
హరీష్ రావు


హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.) రేవంత్ రెడ్డి బిల్డప్ బాబాయ్ అని, ఆయన ఏం మాట్లాడినా అబద్ధమే అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రెండేండ్ల పాలనలో దోపిడీ తప్ప పారదర్శక లేదని, ఆత్మస్తుతి, పరనింద తప్ప రేవంత్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రిది ప్రైవేట్ లిమిటెడ్ పాలన అని, తన రెండేండ్ల పాలనలో చేసింది ఒక్కటైనా చెప్పగలడా అని ప్రశ్నించారు. ప్రజాభవన్ ను జల్సాలకు, విందులు, వినోదాలకు ప్రజాభవన్ను కేరాఫ్గా మార్చారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. పార్టీ నేతలతో కలిసి రేవంత్ రెండేండ్ల పాలనపై తెలంగాణ భవన్లో హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. 'రేవంత్ పాలనలో రెండేళ్లుగా దోపిడీ తప్ప పారదర్శకత లేదు. ఆత్మస్తుతి, పరనింద తప్ప రేవంత్ రెండేండ్లలో చేసిందేమీ లేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీశారు

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande