సంగారెడ్డి జిల్లాలో చలి పులి.. రాష్ట్రంలోనే అత్యల్పo 6.6 డిగ్రీలు
సంగారెడ్డి, 8 డిసెంబర్ (హి.స.) సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చలి వణికిస్తోంది. గ్రామాల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నప్పటికీ, చలి మాత్రం కూల్ కూల్ చేస్తోంది. దీంతో ఓటర్లు బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలోనే మంగ
సంగారెడ్డి చలి


సంగారెడ్డి, 8 డిసెంబర్ (హి.స.) సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చలి

వణికిస్తోంది. గ్రామాల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నప్పటికీ, చలి మాత్రం కూల్ కూల్ చేస్తోంది. దీంతో ఓటర్లు బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలోనే మంగళవారం సంగారెడ్డి జిల్లాలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోహిర్ పట్టణంలో రాష్ట్రంలోనే అతి తక్కువైన 6.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇక న్యాల్ కల్ 7.5 డిగ్రీలు, ఝరాసంగం-మొగుడంపల్లి ప్రాంతాల్లో 7.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చలి ప్రభావంతో ఓటర్లు, ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande