
అమరావతి, 8 డిసెంబర్ (హి.స.)
ఒంగోలు కలెక్టరేట్, : జిల్లాలో స్క్రబ్ టైఫస్ ప్రబలుతోంది. దానిబారినపడి ఎర్రగొండపాలెంకు చెందిన పి.దానమ్మ (61) గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందారు. దానమ్మ గత నెల 16న అనారోగ్యానికి గురయ్యారు. రెండ్రోజులు స్థానికంగానే వైద్యసేవలు పొందారు. అయినా తగ్గకపోవడంతో గతనెల 18న కుటుంబసభ్యులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం కుదుటపడకపోవడంతో 29వతేదీన పరీక్షలు చేశారు. వాటిల్లో ఆమెకు స్క్రబ్ టైఫస్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ