
వనపర్తి, 8 డిసెంబర్ (హి.స.)
వనపర్తి జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ గ్రామాల్లో సోమవారం నాడు పోలీసులు భారి కవాతు నిర్వహించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు తమ పోలీస్ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమతం చేస్తున్నామని ఆత్మకూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ శివకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి అవాంచినీయ సంఘటనలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలు, అదేవిధంగా బెదిరింపులకు లోనవకుండా పూర్తి స్వేచ్చాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పట్టిష్ఠ భద్రత కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..