
అమరావతి, 8 డిసెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ లో పేదరిక నిర్మూలన కోసం తీసుకొచ్చిన జీరో పావర్టీ-పీ4పై (Poverty P4) సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
సోమవారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ప్రణాళిక శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) సమీక్షను జరిపారు.
పీ4 అమలులో భాగంగా బంగారు కుటుంబాలకు అవసరమైన సాయంపై ఇటీవల సర్వే నిర్వహించారు. ఆ సర్వేకు సంబంధించిన అంశాలపై సీఎం ఆర్థిక మంత్రితో పాటు అధికారులతో కలిసి చర్చించారు. వివిధ అంశాలపై సమాలోచనలు జరిపారు. అనంతరం నివేదికను పరిశీలించి తగు సూచనలను సీఎం చేశారు. లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించాలని.. వాటిని సకాలంలో అమలయ్యేలా సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. తద్వారా జీరో పావర్టీ-పీ4 లక్ష్యాలను సాధించాలని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV