
తిరుమల, 8 డిసెంబర్ (హి.స.)
తిరుమల తిరుపతి దేవస్థానంలో సోమవారం ఉదయం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకోవడంతో.. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం భక్తులు 12 కంపార్ట్‌మెంట్ల నిండా వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం పూర్తి కావడానికి సుమారు 8 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే నిన్న ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం శ్రీవారిని 75,343 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,505 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.69 కోట్లుగా నమోదైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV