విజయవాడ | భవాని భక్తుల ఆందోళన
విజయవాడ, 8 డిసెంబర్ (హి.స.)విజయవాడలో (Vijayawada) భవాని భక్తులు ఆందోళనకు దిగారు. తమపై దాడి జరిగిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దైవ నామ స్మరణతో దైవ దర్శనానికి వెళ్తున్న తమపై అకారణంగా దాడి చేశారంటూ వారు వాపోతున్నారు. తమపై దాడి చేసిన కానిస్టేబుల్ పై చట్
vijayawada-bhavani-devotees-agitation-501877


విజయవాడ, 8 డిసెంబర్ (హి.స.)విజయవాడలో (Vijayawada) భవాని భక్తులు ఆందోళనకు దిగారు. తమపై దాడి జరిగిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దైవ నామ స్మరణతో దైవ దర్శనానికి వెళ్తున్న తమపై అకారణంగా దాడి చేశారంటూ వారు వాపోతున్నారు. తమపై దాడి చేసిన కానిస్టేబుల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే పలువురు భవాని మాల ధరించిన (Bhavani Devotees) భక్తులు కంకిపాడు నుంచి ఆటోలో బయలుదేరారు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు ఆటోలో ప్రయాణిస్తున్నారు. వారి ఆటో బెంజ్ సర్కిల్ కు చేరుకుంది. రామలింగేశ్వర కట్ట వద్ద భవానీ స్వాములు ప్రయాణిస్తున్న ఆ సమయంలో అక్కడే ఉన్న కానిస్టేబుల్ ఆటోను అడ్డుకున్నారు. తమను ఎందుకు అడ్డుకున్నారని భవాని స్వాములు కానిస్టేబుల్ ను ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మాటా మాటా పెరగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పలువురు భవానీ స్వాములు సర్కిల్లో నిరసనకు దిగారు. కానిస్టేబుల్ భవానీ మాలధారులపై దాడి చేశారని ఆరోపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande