వేల కోట్ల విలువైన భూములు అమ్మే పని లో సీఎం రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్యే వేముల
నిజామాబాద్, 9 డిసెంబర్ (హి.స.) కేసీఆర్ దీక్ష ఫలితంగా వచ్చిన డిసెంబర్ 9 ప్రకటన తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజు అని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా భీమగల్ పట్టణంలో మంగళవారం విజయ దివస్ కార్యక్రమంలో భాగంగా అంబ
ఎమ్మెల్యే వేముల


నిజామాబాద్, 9 డిసెంబర్ (హి.స.)

కేసీఆర్ దీక్ష ఫలితంగా వచ్చిన డిసెంబర్ 9 ప్రకటన తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజు అని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా భీమగల్ పట్టణంలో మంగళవారం విజయ దివస్ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూల దండ వేసి, తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో పోరాటాల ఫలితంగా తెలంగాణ సాకారమైందన్నారు. సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. సాధ్యం కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో రూ. వేల కోట్ల విలువైన భూములు అమ్మే పని సీఎం రేవంత్ రెడ్డి పెట్టుకున్నారని విమర్శించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande