తిరుపతి లో ఎప్పటినుంచో ఎదురుచూస్తున ఈట్.స్ట్రీట్
తిరుపతి: 9 డిసెంబర్ (హి.స.) తిరుపతి లో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈట్‌ స్ట్రీట్‌ (ఫుడ్‌ కోర్ట్‌)కు వేగంగా అడుగులు పడుతోంది. ప్రస్తుత నగరపాలక సంస్థ కార్యాలయానికి ఎదురుగా ఉన్న అచ్యుత దేవరాయలు మార్గంలో ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 40 నుంచి 50 స్టాళ
తిరుపతి లో ఎప్పటినుంచో ఎదురుచూస్తున ఈట్.స్ట్రీట్


తిరుపతి: 9 డిసెంబర్ (హి.స.)

తిరుపతి లో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈట్‌ స్ట్రీట్‌ (ఫుడ్‌ కోర్ట్‌)కు వేగంగా అడుగులు పడుతోంది. ప్రస్తుత నగరపాలక సంస్థ కార్యాలయానికి ఎదురుగా ఉన్న అచ్యుత దేవరాయలు మార్గంలో ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 40 నుంచి 50 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. 8/16 సైజుగల 12 కంటైనర్లను స్టాళ్లుగా మార్చనున్నారు. మిగిలినవి నిర్దేశించిన ఖాళీ స్థలాన్ని స్టాళ్లుగా మార్చుకునేందుకు టెండరుదారుకు కేటాయించనున్నారు. రెండు నెలల్లో పూర్తిచేసి, ఫుడ్‌ కోర్టు అందుబాటులోకి తీసుకురానున్నట్టు కార్పొరేషన్‌ వర్గాలు చెబుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande