గ్లోబల్ సమ్మిట్ సెకండ్ డే రూ.1,04,350 కోట్ల ఎంవోయులు
హైదరాబాద్, 9 డిసెంబర్ (హి.స.) తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. రెండో రోజు సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు పారిశ్రామిక వేత్తలతో వరుసగా సమావేశం
గ్లోబల్ సమ్మిట్


హైదరాబాద్, 9 డిసెంబర్ (హి.స.)

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. రెండో రోజు సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు పారిశ్రామిక వేత్తలతో వరుసగా సమావేశం అయ్యారు. సందర్భంగా పలు కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. రెండో రోజు ఇప్పటి వరకు ఆయా సంస్థలు రూ.1,04,350 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయి.

తెలంగాణ ప్రభుత్వంతో ఇవాళ గోద్రెజ్ జెర్సీ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా మిల్క్, ఎఫ్ఎమ్సీజీ, రియల్ ఎస్టేట్, ఆయిల్ పామ్ విభాగాల్లో పెట్టుబడులకు గోద్రెజ్ ఆసక్తి చూపింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande