సర్పంచ్ ఎన్నికల రోజునే ఏపీపీ పరీక్ష నిర్వహించడం సరికాదు: హరీశ్ రావు
హైదరాబాద్, 9 డిసెంబర్ (హి.స.) రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న రోజునే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) రాత పరీక్షను నిర్వహించడం సరికాదని వెంటనే ఆ పరీక్షను వాయిదా వేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈరోజు హైకోర్టు సీనియర్ న్
హరీష్ రావు


హైదరాబాద్, 9 డిసెంబర్ (హి.స.)

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న రోజునే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) రాత పరీక్షను నిర్వహించడం సరికాదని వెంటనే ఆ పరీక్షను వాయిదా వేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈరోజు హైకోర్టు సీనియర్ న్యాయవాది శివ శేఖర్ ఆధ్వర్యంలో న్యాయవాదుల బృందం హరీశ్ రావుని కలిసి వినతిపత్రం సమర్పించారు. డిసెంబర్ 14న జరగాల్సిన ఏపీపీ పరీక్షను వాయిదా వేయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబర్ 14 న రాత పరీక్ష నిర్వహించాలని నోటిఫికేషన్ ఇచ్చారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande