డిసెంబర్ 9.. రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడిన రోజు: కేటీఆర్
హైదరాబాద్, 9 డిసెంబర్ (హి.స.) తుది దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడిన రోజు డిసెంబర్ 9 (విజయ్ దివస్) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సబ్బండ వర్గాల పోరాటం, అమరుల త్యాగం, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పీ
కేటీఆర్


హైదరాబాద్, 9 డిసెంబర్ (హి.స.) తుది దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడిన రోజు డిసెంబర్ 9 (విజయ్ దివస్) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సబ్బండ వర్గాల పోరాటం, అమరుల త్యాగం, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పీఠం వణికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి నేటికి 16 ఏండ్లయిందని చెప్పారు. నవంబర్ 29 లేకుంటే డిసెంబర్ 9 లేదని , డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదని వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande