ప్రశాంత ఎన్నికలు ప్రతి ఒక్కరి బాధ్యత : ఖమ్మం సీపీ సునీల్ దత్
ఖమ్మం, 9 డిసెంబర్ (హి.స.) గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు, రాజకీయ నాయకుల బాధ్యత ఉంటుందని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. మంగళవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఖమ్మం రూరల్ మండలంకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీ
ఖమ్మం సిపి


ఖమ్మం, 9 డిసెంబర్ (హి.స.) గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు, రాజకీయ నాయకుల బాధ్యత ఉంటుందని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. మంగళవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఖమ్మం రూరల్ మండలంకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీ నాయకులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ నెల 14న గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రతి గ్రామంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ తరపున, ఎన్నికల అధికారుల తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఎలాంటి అలజడులు, గొడవలకు తావిపోవద్దని, వ్యక్తిగత వివాదాలకు చోటు ఇవ్వరాదన్నారు. ఎన్నికల నియమాలను తప్పకుండా పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande