రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి.లోకేష్ అమెరికా పర్యటనలో బిజీ
అమరావతి/శాన్ ఫ్రాన్సిస్కో 9 డిసెంబర్ (హి.స.) అమెరికా పర్యటనలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రముఖ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో మంత్రి వరుసగా భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా ఓప్స్ ర్యాంప్) సీ
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి.లోకేష్ అమెరికా పర్యటనలో బిజీ


అమరావతి/శాన్ ఫ్రాన్సిస్కో 9 డిసెంబర్ (హి.స.)

అమెరికా పర్యటనలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రముఖ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో మంత్రి వరుసగా భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా ఓప్స్ ర్యాంప్) సీఈవో వర్మతో భేటీ అయిన మంత్రి లోకేష్... ఐటీ మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఏపీలో స్మార్ట్ సిటీలు, డిజిటల్ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్‌ల కోసం ఐటీ మౌలిక సదుపాయాల ఆధునీకరణకు మద్దతు ఇవ్వాలని వినతి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande