
అమరావతి, 9 డిసెంబర్ (హి.స.):అమరావతిలో లే అవుట్ రోడ్‌లు అన్ని ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయని... అనుకున్న సమయానికే పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈరోజు (మంగళవారం) రాజధానిలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులకు ఇచ్చిన ప్లాట్‌లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రెండేళ్లలో డ్రైనేజ్‌లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన రోడ్లు పనులు పూర్తి అవుతాయని చెప్పారు. సీడ్ యాక్సిస్ రహదారిని మంగళగిరి రహదారికి అనుసంధానించి త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ