గ్లోబల్ సమ్మిట్ లో ఇందిరమ్మ చీరలో మెరిసిన మంత్రి కొండా సురేఖ..
హైదరాబాద్, 9 డిసెంబర్ (హి.స.) మంత్రి కొండా సురేఖ ఇందిరమ్మ చీరను కట్టుకొని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరయ్యారు. ఆమెను చూసిన మంత్రులు, అధికారులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరోవైపు ఇందిరమ్మ చీర కట్టిన సురేఖ ఫొటోలు సోషల్ మీడియాలోనూ వ
మంత్రి సురేఖ


హైదరాబాద్, 9 డిసెంబర్ (హి.స.)

మంత్రి కొండా సురేఖ ఇందిరమ్మ చీరను కట్టుకొని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరయ్యారు. ఆమెను చూసిన మంత్రులు, అధికారులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరోవైపు ఇందిరమ్మ చీర కట్టిన సురేఖ ఫొటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.

కాగా, ఫ్యూచర్ సిటీ (Future City) వేదికగా జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ప్రభుత్వం అమలు చేస్తున్న, చేయబోతున్న పథకాలపై ఏర్పాటు చేసిన స్టాల్స్ దేశీయ, విదేశీ అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande