కొత్త డీసీసీలకు డెడ్ లైన్.. మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్, 9 డిసెంబర్ (హి.స.) బాధ్యతలు స్వీకరించిన వెంటనే డీసీసీలు జిల్లా సీనియర్ నేతలు, ముఖ్య నాయకులను కలుపుకుని సమన్వయంతో పని చేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హితవు పలికారు. కొత్త డీసీసీ అధ్యక్షులు ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నిర్ణయిం
మహేష్ కుమార్ గౌడ్


హైదరాబాద్, 9 డిసెంబర్ (హి.స.)

బాధ్యతలు స్వీకరించిన వెంటనే డీసీసీలు జిల్లా సీనియర్ నేతలు, ముఖ్య నాయకులను కలుపుకుని సమన్వయంతో పని చేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హితవు పలికారు. కొత్త డీసీసీ అధ్యక్షులు ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నిర్ణయించిన ఆరు నెలల పనితీరు డెడ్లైన్ మరువకూడదని, ఆ గడువులోపు స్పష్టమైన పురోగతిని చూపించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ, సమన్వయంతో పని చేస్తేనే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాలు ఖాయం అవుతాయని స్పష్టం చేశారు. ఇవాళ హైదరాబాద్ డీసీసీ అధ్యక్షులు, ఫ్రంటల్ మరియు అనుబంధ సంఘాల చైర్మన్లతో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక సూచనలు, మార్గదర్శకాలు జారీ చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande