డిసెంబర్ చివరి నాటికి వందే భారత్ స్లీపర్ రైలు పరుగులు
హైదరాబాద్, 9 డిసెంబర్ (హి.స.) కేంద్రప్రభుత్వం చొరవతో ఇండియన్ రైల్వే దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లలో త్వరలోనే స్లీపర్ వెర్షన్ ను సైతం ఇండియన్ రైల్వే తీసుకురాబోతోంది. తేజస్ తరహా వేగం.. రాజధాని రైలు త
వందే భారత్


హైదరాబాద్, 9 డిసెంబర్ (హి.స.)

కేంద్రప్రభుత్వం చొరవతో ఇండియన్

రైల్వే దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లలో త్వరలోనే స్లీపర్ వెర్షన్ ను సైతం ఇండియన్ రైల్వే తీసుకురాబోతోంది. తేజస్ తరహా వేగం.. రాజధాని రైలు తరహా సౌకర్యాలతో.. తొలి స్లీపర్ రైలు ఢిల్లీ పాట్నా మార్గలో నడవనుంది. డిసెంబర్ చివరి నాటికి వందేభారత్ స్లీపర్ రాకపోకలు సాగించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

వందేభారత్ స్లీపర్ ట్రైన్ రూపొందుతుండగా.. 16 827 కోచ్ లతో బెర్తులు ఉండనున్నాయి. ఇందులో 611 థర్డ్ ఏసీ, 188 సెకండ్ ఏసీ, 24 ఫస్ట్ ఏసీ బెర్తులు ఉంటాయి. ఆటోమెటిక్ డోర్లు, బయో టాయిలెట్స్, సీసీటీవీ కెమెరాలు, వ్యక్తిగత రీడింగ్ లైట్లు, ప్రీమియం క్వాలిటీతో సౌకర్యంగా ఉండే ఇంటీరియర్ తో డిజైన చేస్తున్నారు. గంటకు గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టనుంది. వారంలో ఆరురోజుల పాటు రాకపోకలు సాగించనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande