అమరావతి, 28 జూలై (హి.స.)
పోటీ ప్రపంచానికి తగ్గట్లుగా తపాలా శాఖ సేవలు మారుతున్నాయి. తపాలా 2.0. విధానం మంగళవారం నుంచి జిల్లాలోని పోస్టాఫీసుల్లో ఆచరణలోకి వచ్చింది. పొదుపు, బీమాతో పాటు డిజిటల్ చెల్లింపులు ఉండబోతున్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తపాలా సేవలు వేగంగా.. సౌలభ్యంగా.. మరింత జవాబుదారీతనాన్ని సంతరించుకోనున్నాయి. నూతన విధానంలో సేవలపై ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. సులువుగా సేవలతో పాటు ఫిర్యాదులకూ అవకాశం కల్పించారు. అన్నివర్గాల ప్రజల్ని ఆకర్షించేలా సేవలు ఉండనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ