బాటసింగారం, 28 జూలై (హి.స.)
: రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం ఈగల్ టీమ్, రాచకొండ పోలీసులు తనిఖీలు చేపట్టి.. 935 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎవరికీ అనుమానం రాకుండా గంజాయిని 455 ప్యాకెట్లుగా చేసి పండ్ల ట్రేలల్లో ఉంచి డీసీఎంలో తరలిస్తున్నట్లు వెల్లడించారు. ముగ్గురు అంతర్‌రాష్ట్ర నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ