హైదరాబాద్, 28 జూలై (హి.స.)
మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఆటో అదుపు తప్పి బావిలో పడింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నెల్లికుదుర్ (మ) మునిగలవేడు గ్రామంలో గత అర్ధ రాత్రి సమయంలో ఆటో అదుపు తప్పి బావిలో పడ్డది. ప్రమాద సమయంలో భార్యాభర్తలు వారి కొడుకు ప్రయాణిస్తున్నారు. ఆటో బావిలో పడడంతో భర్త శ్రీరామ్ నర్సయ్య గాయపడి మృతి చెందాడు. భార్య శ్రీరామ్ భారతమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కొడుకు మార్కండేయకి స్వల్ప గాయాలు అయ్యాయి. అటుగా వెళ్తున్న వారు ఇది గమనించి బాధితులను బావి నుంచి బయటకు తీశారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..