తప్పులు బయటపడతాయనే కాంగ్రెస్ పారిపోయింది: కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, 28 జూలై (హి.స.) ఆపరేషన్ సిందూర్ పై చర్చకు పిలిచి ప్రతిపక్షాలు పారిపోయాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అరవై ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు తీవ్రవాదానికి బలైపోయిన పట్టించుకోలేదన్నారు. తీవ్రవాదాన్ని అంతం చేయాలని బీజేపీ న
కిషన్ రెడ్డి


న్యూఢిల్లీ, 28 జూలై (హి.స.)

ఆపరేషన్ సిందూర్ పై చర్చకు పిలిచి

ప్రతిపక్షాలు పారిపోయాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అరవై ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు తీవ్రవాదానికి బలైపోయిన పట్టించుకోలేదన్నారు. తీవ్రవాదాన్ని అంతం చేయాలని బీజేపీ నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ సహించలేకపోతుందని సంచలన ఆరోపణలు చేశారు. చర్చ జరగాల్సిన సమయంలో రాహుల్ గాంధీ రాకుండా పారిపోయారన్నారు. గతంలో కాంగ్రెస్ లో ఎన్ని వేల మంది ఉగ్రవాదానికి బలయ్యారో మనం చూశామన్నారు. పాకిస్థాన్ పై కాంగ్రెస్ మెతకవైఖరి అవలంభించిందన్నారు. ఇప్పటి వరకు చేసిన పొరపాట్లు అన్ని బయటకు వస్తాయనే కాంగ్రెస్ పార్టీ పారిపోతోందని వ్యాఖ్యానించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande