హైదరాబాద్, 28 జూలై (హి.స.)
: నగరంలో చిరుత సంచారం కలకలం రేపింది. గోల్కొండలోని ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. తారామతి వెనుకభాగం మూసీ వైపు చిరుత వెళ్లినట్లు సమాచారం. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు గోల్కొండ పోలీసులు సమాచారం ఇచ్చారు. కొన్ని రోజులుగా మంచిరేవుల, నార్సింగి ప్రాంతాల్లో చిరుత సంచరిస్తోంది. గ్రేహౌండ్స్ ప్రాంతంలో 4 బోన్లు, ట్రాప్ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. బోన్లకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతోంది. ఈ క్రమంలోనే ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతంలో చిరుత రోడ్డుదాటినట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ