అమరావతి, 28 జూలై (హి.స.)
దసరా ఉత్సవాలకు సమయం రానేవచ్చింది.. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు.. ఈ సమయంలో.. ఒక్కో రోజు.. ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.. సెప్టెంబర్ 22న దసరా ఉత్సవాలు ప్రారంభంకానుండగా.. అక్టోబర్ 2వ తేదీన విజయదశమి రోజున ఉదయం 9.30 గంటలకు మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగియనున్నాయి.. అదేరోజు సాయంత్రం 5 గంటలకు పవిత్ర కృష్ణానది యందు హంసవాహన తెప్పోత్సవం నిర్వహించనున్నారు.. ఇక, సెప్టెంబర్ 29న మూలానక్షేత్రం రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ