ప్రభుత్వ బడులకు ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్న తెలంగాణ సర్కార్..
హైదరాబాద్, 28 జూలై (హి.స.) తెలంగాణలోని సర్కారు బడులకు మహర్దశ పట్టబోతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై సాంకేతిక టెక్నాలజీతో విద్యాబోధన జరగనుంది. డిజిటల్ తరగతులు, Al క్లాసుల కోసం ప్రభుత్వ స్కూళ్లకు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున
ప్రభుత్వ బడులు


హైదరాబాద్, 28 జూలై (హి.స.)

తెలంగాణలోని సర్కారు బడులకు మహర్దశ పట్టబోతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై సాంకేతిక టెక్నాలజీతో విద్యాబోధన జరగనుంది. డిజిటల్ తరగతులు, Al క్లాసుల కోసం ప్రభుత్వ స్కూళ్లకు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నట్టు తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రానున్న 6 నెలల్లో 11,476 పాఠశాలల్లో ఉచిత ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. కేంద్రంలో రాష్ట్రానికి జరిగిన ఒప్పందంలో భాగంగా ఇప్పటికే 5,992 స్కూళ్ళలో బీఎస్ఎన్ఎల్ ఫ్రీ ఇంటర్నెట్ అందిస్తున్న విషయం తెలిసిందే.

వీటితోపాటు మరో 5,992 పాఠశాలలకు కూడా ఉచిత ఇంటర్నెట్ ఇవ్వాలని బీఎస్ఎన్ఎల్ కు రాష్ట్ర విద్యాశాఖ ఈ మేరకు లేఖ రాసింది. రానున్న ఆరునెలల్లో ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం రానుండటం పట్ల, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande