ఈ నెల 31న కాళేశ్వరం నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్న కమిషన్
హైదరాబాద్, 28 జూలై (హి.స.) మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటు, అవకతవకలపై న్యాయ విచారణ కోసం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ విచారణ తుది అంకానికి చేరుకుంది. ఈ విచారణకు సంబంధించిన తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పిం
కాలేశ్వరం


హైదరాబాద్, 28 జూలై (హి.స.)

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటు, అవకతవకలపై న్యాయ విచారణ కోసం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ విచారణ తుది అంకానికి చేరుకుంది. ఈ విచారణకు సంబంధించిన తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించేందుకు పీసీ ఘోష్ కమిషన్ సర్వం సిద్ధం చేసుకుంటోంది. ఈ నెల 31న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పదవీ కాలం ముగియనుంది. దాంతో అదే రోజున పీసీ ఘోష్ కమిషన్ వద్ద నుంచి తుది రిపోర్ట్ ను ఇరిగేషన్ శాఖ తీసుకోనుంది. నిన్నే కోల్ కతా నుంచి హైదరాబాద్ చేరుకున్న కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్.. ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చే ముందు లీగల్ అంశాలను సమాచారం. పరిశీలిస్తున్నట్లు న్యాయపరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఫైనల్ రిపోర్ట్ ను పీసీ ఘోష్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande