కారేపల్లి మండల కేంద్రంలో కలెక్టర్ అనుదీప్ ఆకస్మిక తనిఖీలు
తెలంగాణ, ఖమ్మం. 28 జూలై (హి.స.) ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండల కేంద్రంలో సోమవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా కారేపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లారు. పాఠశాల ప్రాంగణమంత
ఖమ్మం కలెక్టర్


తెలంగాణ, ఖమ్మం. 28 జూలై (హి.స.)

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండల కేంద్రంలో సోమవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా కారేపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లారు. పాఠశాల ప్రాంగణమంతా కలియతిరిగి పరిసరాలను పరిశీలించారు. స్కూల్ ఆవరణంలో చెత్తాచెదారం, దుర్వాసనతో కూడిన అపరిశుభ్రత నెలకొనడంతో ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంప్యూటర్, సైన్స్ ల్యాబ్ లు, పుస్తకాలు, విద్యార్థుల యూనిఫామ్, క్రీడా సామగ్రి నిల్వ ఉంచే గదులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. తరగతి గదుల్లోకి ప్రవేశించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులతో పుస్తకాల్లోని పాఠాలను చదివించి సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులను భోజనశాలలో కలిసి రుచి, ప్రామాణ్యతపై అడిగి తెలుసుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande