తెలంగాణ, గజ్వేల్. 28 జూలై (హి.స.)
గ్రీన్ ఇండియా చాలెంజ్ అందరి అవసరమని.. ప్రతి ఒక్కరూ ఈ బృహత్తర కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్లోని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి కార్యాలయంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ హరితసేన జిల్లా ఇంచార్జి చెప్యాల రాజేశ్వరరావుతో కలిసి 8వ ఎడిషన్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడు వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎనిమిదవ ఎడిషన్ కీసర గుట్టలో మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించుకున్నమని అన్నారు.
భారతదేశాన్ని పచ్చదనంతో నింపాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఒకరు మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి చాలెంజ్ విసిరి మూడు మొక్కలు నాటాల్సిందిగా చాలెంజ్ విసరగా.. అది నేడు 20 కోట్లకుపైగా మొక్కలు నాటిన బృహత్తర కార్యక్రమం అయిందన్నారు. సామాన్యుల నుండి సినీ ప్రముఖులు, రాజకీయాలకతీతంగా, కవులు, కళాకారులు ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో ఒక యజ్ఞంలా కొనసాగుతుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు