తెలంగాణ, కరీంనగర్ 28 జూలై (హి.స.) కరీంనగర్ జిల్లాలోని
తిమ్మాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలో సదాశివపల్లి గ్రామ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మరియు అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మీదుగా ప్రొసీడింగ్లు, చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవంపల్లి మాట్లాడుతూ మొదటి విడత కు ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఐదు విడతల్లో డబ్బులను వారి ఖాతాల్లో జమ చేస్తుందన్నారు. నిరుపేద కుటుంబాలు ఇండ్లు నిర్మించుకొనుటకు ప్రభుత్వం వారి ఖాతాలో నగదును జమ చేస్తుందన్నారు.
అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించినట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు