గత సర్కార్ చేసిన తప్పులను సరిదిద్దుతున్నాం.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, 28 జూలై (హి.స.) పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని పంచాయతీ రాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఇవాళ మాసబ్ ట్యాంక్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో 7వ గిరిజన సంక్షేమ సలహా మండలి సమావేశాన్ని ని
సీతక్క


హైదరాబాద్, 28 జూలై (హి.స.)

పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని పంచాయతీ రాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఇవాళ మాసబ్ ట్యాంక్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో 7వ గిరిజన సంక్షేమ సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, డిప్యూటీ స్పీకర్ రామచంద్రూనాయక్, ఎంపీ గోడెం నగేష్, ఆదివాసి గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, గిరిజన శాఖ కార్యదర్శి శరత్, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించిందని ఆరోపించారు. ఆదివాసి గిరిజన ప్రాంతాలకు రోడ్లు, వంతెనలు అవసరమని అన్నారు. కానీ గతంలో నిధులు పక్కదారి పట్టించడం వల్ల చాలామంది గర్భిణులు ప్రసవ వేదనను అనుభవించారని గుర్తు చేశారు. ఏ ప్రభుత్వమైనా నిధులను పక్కదారి పట్టించవద్దని అన్నారు. ఎస్టీలకు కేటాయించిన నిధులను వారికి మాత్రమే ఖర్చు చేయాలని అన్నారు. సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టిస్తే ఏజెన్సీ ఏరియాలు వెనకబాటుతో మగ్గిపోతాయని తెలిపారు. అందుకే ఎస్టీలకు కేటాయించిన ప్రతి పైసా వారి అభివృద్ధికే ఖర్చు చేయాలని సూచించారు. గిరిజనుల్లో చాలామందికి ఉండటానికి ఇండ్లు కూడా లేవని.. కాబట్టి ఇండ్ల నిర్మాణం కోసం బడ్జెట్ నిధులను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నాం అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande