హైదరాబాద్, 28 జూలై (హి.స.)
సిట్ విచారణకు హాజరైన బీఆర్ఎస్
నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రుల ఫోన్లను రేవంత్ రెడ్డి టాప్ చేస్తున్నారని సిట్ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశానన్నారు. రేవంత్ మాట్లాడిన వీడియో ఫుటేజ్ ఎవిడెన్స్ కూడా ఇచ్చానన్నారు.
రేవంత్ రెడ్డి ఫోన్లను టాప్ చేయడమే కాకుండా డార్క్ వెబ్లో అత్యంత ఖరీదైన సాఫ్ట్ వేర్ టూల్స్ ఉపయోగిస్తూ తమ సొంత మంత్రుల ఫోన్లను, ప్రతిపక్ష నేతల ఫోన్లను టాప్ చేస్తున్నారని సైడ్ పోస్ట్ పత్రిక రాసిందన్నారు. కాబట్టి ఆ మంత్రులను కూడా విచారణకు సిట్ అధికారులు పిలిపించాలని డిమాండ్ చేశారు. వాళ్ల ఫోన్లను కూడా పరిశీలించాలని, వాళ్ల ఫోన్లను ఫోరెన్సిక్ నిపుణులతో పరిశీలించాలన్నారు. వాళ్ల ఫోన్లలోకి ఏ విధంగా సాఫ్ట్ వేర్ మాల్వేర్ పంపించారు అనేదానిపై పూర్తి విచారణ జరగాలని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్