నిర్మల్, 28 జూలై (హి.స.)
రోడ్డు ప్రమాదంలో నిర్మల్ జిల్లా ముథోల్ ఆశ్రమ
పాఠశాల పీఈటీ నరేష్ మృతి చెందిన ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ జిల్లాలోని కుభీర్ మండలం సిర్పెల్లి తాండకు చెందిన ఆడే నరేష్ (45 ) ముథోల్ నియోజకవర్గ కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడుగా (పి ఈ టి) విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే తన ద్విచక్ర వాహనం పై నేడు పాఠశాలకు వెలుతుండగా నిజామాబాద్ వైపు నుంచి భైంసా కి వస్తున్న బస్సు సేవాలాల్ చౌక్ సమీపంలో బైక్ ను ఢీ కొట్టింది. దీంతో తీవ్రగాయాల పాలైన నరేష్ ను వెంటనే 108 అంబులెన్స్ లో భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించగా... అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా డాక్టర్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..