వీఐపీలు ఏడాదికి ఒక్కసారి మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాల
మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు..
Venkaiah Naidu


అమరావతి, 28 జూలై (హి.స.)తిరుమలలో వీఐపీల దర్శనంపై కీలక వ్యాఖ్యలు చేశారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు.. వీఐపీలు ఏడాదికి ఒక్కసారి మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలంటూ సూచించారు.. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి నిన్న తిరుమల చేరుకున్న వెంకయ్య నాయుడు.. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా.. అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వెంకయ్యనాయుడు.. టీటీడీ నిధుల వ్యయంలో రాజకీయ జోక్యం ఉండకూడదన్నారు.. టీటీడీ నిధులను శ్రీవారి భక్తుల సౌకర్యాలకే వినియోగించాలన్నారు వెంకయ్య నాయుడు. మరోవైపు ఊరుకో గుడి.. బడి ఉండాలని.. బడి ఏర్పాటు బాధ్యత ప్రభుత్వాన్నిదైతే.. కానీ, గుడి నిర్మాణ బాధ్యతను టీటీడీ తీసుకోవాలన్నారు వెంకయ్య నాయుడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande