తిరుమల, 28 జూలై (హి.స.)
:తిరుమలలో వేంకటేశ్వర స్వామినిజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కన్నడ హీరో శివరాజ్ కుమార్, దర్శకుడు గోపీచంద్, ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, శ్రీధర్ దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించడం ఆనందదాయకంగా ఉందని వ్యాఖ్యానించారు. అన్నప్రసాదాన్ని చాలా చక్కని రుచితో పాటు శుచిగా చేస్తున్నారని ప్రశంసించారు. నిత్యం వేలాది మంది భక్తులకు స్వామివారి అన్నప్రసాదం అందజేస్తున్నఈ కేంద్రం నిర్వహణా బృందానికి అభినందనలు తెలిపారు. ఈ స్పూర్తిని అన్ని ఆలయాలు ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారువెంకయ్య నాయుడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ