'హరిహర వీరమల్లు'పై వైసీపీ ప్రచారం దుర్మార్గం: నాగబాబు
అమరావతి, 28 జూలై (హి.స.)పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ఇటీవలే విడుదలైన హరిహర వీరమల్లు చిత్రంపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు స్పందించారు. హరిహర వీరమల్లు చిత్రంపై వైసీపీ వాళ్లు చేస్తున్న ప్రచారం దుర్మార్గం అని అన్నారు. వైసీపీని, ఆ పార్టీ నేతలను ఏమనాలో అర్థంకావడం
'హరిహర వీరమల్లు'పై వైసీపీ ప్రచారం దుర్మార్గం: నాగబాబు


అమరావతి, 28 జూలై (హి.స.)పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ఇటీవలే విడుదలైన హరిహర వీరమల్లు చిత్రంపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు స్పందించారు. హరిహర వీరమల్లు చిత్రంపై వైసీపీ వాళ్లు చేస్తున్న ప్రచారం దుర్మార్గం అని అన్నారు. వైసీపీని, ఆ పార్టీ నేతలను ఏమనాలో అర్థంకావడం లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం విషయంలోనూ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నాగబాబు జనసైనికులకు పిలుపునిచ్చారు. మరో 20 ఏళ్లు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు.

ఇక, తనకు పదవులపై ఎలాంటి ఆశ లేదని, జనసేన కార్యకర్తగా ఉండడానికే ఇష్టపడతానని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో ఇప్పటివరకు కమిటీలు వేయలేదని, అయినప్పటికీ కార్యకర్తలు సహనం పాటించాలని సూచించారు. ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేయించిన కార్యకర్తలనే నామినేటెడ్ పదవులకు పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande