రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోలకు 1,350 కొత్త బస్సులు కేటాయింపు
వాకాడు, 29 జూలై (హి.స.) , , రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోలకు 1,350 కొత్త బస్సులు కేటాయించనున్నట్లు ఆ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సోమవారం తిరుపతి జిల్లాలోని వెంకటగిరి, వాకాడు డిపోలు, బస్టాండ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోలకు 1,350 కొత్త బస్సులు  కేటాయింపు


వాకాడు, 29 జూలై (హి.స.)

, , రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోలకు 1,350 కొత్త బస్సులు కేటాయించనున్నట్లు ఆ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సోమవారం తిరుపతి జిల్లాలోని వెంకటగిరి, వాకాడు డిపోలు, బస్టాండ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే 750 నూతన బస్సులు మంజూరయ్యాయని, మరో 600 బస్సుల కోసం ప్రతిపాదనలు పంపామన్నారు. వచ్చేనెల నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించినందున మొత్తం 11,000 బస్సుల్లో 74 శాతం బస్సులను అందుకు కేటాయిస్తున్నామని చెప్పారు. ఉచిత సౌకర్యాన్ని ప్రస్తుత జిల్లాలకే పరిమితం కాకుండా ఉమ్మడి జిల్లాలకు విస్తరించడంపైనా కసరత్తు చేస్తున్నామని వివరించారు. వచ్చే రెండు నెలల్లో ప్రతి బస్టాండ్‌లో తాగునీటి సౌకర్యం, కుర్చీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రయాణికుల సంఖ్యను బట్టి పల్లెవెలుగు బస్సుల పెంపు ఉంటుందని చెప్పారు. ఆర్టీసీలోని అన్ని ర్యాంకుల ఉద్యోగులకు వచ్చే నెలాఖరులోగా పదోన్నతులు కల్పిస్తామని ఎండీ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande