న్యూఢిల్లీ, 29 జూలై (హి.స.)
,:ఐఐటీ తిరుపతిలో మౌలిక సదుపాయాల విస్తరణ కోసం ఫేజ్-2లో భాగంగా రూ.2,313.02 కోట్లు మంజూరు చేశామని కేంద్ర సహాయ మంత్రి సుకాంత మజుందార్ తెలిపారు. సోమవారం, లోక్‌సభలో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి ఈ మేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ‘ఫేజ్-1లో భాగంగా ఐఐటీ తిరుపతి శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి రూ.1,091.75 కోట్లు విడుదల చేశాం. ఈ క్యాంపస్ అక్టోబరు 2023 నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2014 తర్వాత ఏర్పాటైన ఐదు ఐఐటీల్లో విద్య, మౌలిక సదుపాయాల విస్తరణకు రూ.11,828.79 కోట్లు మంజూరు చేశాం’ అని మజుందార్ వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ