అరుదైన అవకాశం ఒక్క సంతకం దూరంలోనే.. మంత్రి కొండా సురేఖ.
హైదరాబాద్, 29 జూలై (హి.స.) బీసీ రిజర్వేషన్ల సాధనకు ధిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఛలో ఢిల్లీ కార్యక్రమానికి కార్యాచరణ రూపొందించారు. దీనిపై మంగళవారం తన ఎక్స్ ఖా
మంత్రి కొండా సురేఖ


హైదరాబాద్, 29 జూలై (హి.స.)

బీసీ రిజర్వేషన్ల సాధనకు ధిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఛలో ఢిల్లీ కార్యక్రమానికి కార్యాచరణ రూపొందించారు. దీనిపై మంగళవారం తన ఎక్స్ ఖాతా వేదికగా మంత్రి కొండా సురేఖ ఆసక్తికర ట్వీట్ చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. దేశంలోనే తొలిసారిగా బీసీ బిడ్డలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కే అరుదైన అవకాశం ఒక్క సంతకం దూరంలో ఉందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రపతి సంతకం చేసేలా విజ్ఞప్తి చేయడానికి బీసీ బిడ్డలరా కదలి రావాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 5, 6, 7వ తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమానికి హాజరు కావాలని సూచించారు. మన కోసం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు ఇండియా కూటమి ఎంపీలంతా కదలి రాబోతున్నారని ట్వీట్లో పోస్టర్ విడుదల చేశారు. కాగా, బీసీ రిజర్వేషన్ల సాధనకు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులందరితో ఆగస్టు 6న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని మంత్రి వర్గం తాజాగా నిర్ణయం తీసుకుంది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande