త్వరలో మాజీమంత్రి ముఖేష్ గౌడ్ విగ్రహం ఏర్పాటు : మంత్రి పొన్నం
హైదరాబాద్, 29 జూలై (హి.స.) మాజీ మంత్రి దివంగత ముఖేష్ గౌడ్ విగ్రహం ఏర్పాటుకు పార్టీ నిర్ణయం తీసుకుందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఈ మేరకు మంగళవారం ముఖేష్ గౌడ్ జయంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబ
మంత్రి పొన్నం


హైదరాబాద్, 29 జూలై (హి.స.)

మాజీ మంత్రి దివంగత ముఖేష్ గౌడ్ విగ్రహం ఏర్పాటుకు పార్టీ నిర్ణయం తీసుకుందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఈ మేరకు మంగళవారం ముఖేష్ గౌడ్ జయంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్, శివశంకర్ విగ్రహాలు త్వరలో పెట్టనున్నామన్నారు. బీసీ నాయకులుగా వారు చేసిన సేవలకు గుర్తింపుగానే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. విగ్రహాలను ఎప్పుడు, ఎక్కడ పెడతామనేది త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. హైదరాబాద్ నుండి మంత్రిగా పనిచేసిన ముఖేష్ గౌడ్ నగర ఇమేజ్ ను పెంచడంలో ఎంతగానో పని చేశారని కొనియాడారు. బడుగు, బలహీనవర్గాల అభ్యన్నతికి పరితపించారని, ఆయన అభిమానులు కోరుకుంటున్నట్లుగా త్వరలో విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఆయన పేరు చిరస్మరణీయంగా ఉంటుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande