ఆగస్టు 3న ఒకే షిఫ్టులో నీట్‌ పీజీ ఎంట్రన్స్‌ పరీక్ష.. మరో 3 రోజుల్లోనే అడ్మిట్‌ కార్డులు విడుదల
అమరావతి, 29 జూలై (హి.స.) దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్‌ పీజీ 2025 పరీక్ష మరో వారంలో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) చకచకా ఏర
ఆగస్టు 3న ఒకే షిఫ్టులో నీట్‌ పీజీ ఎంట్రన్స్‌ పరీక్ష.. మరో 3 రోజుల్లోనే అడ్మిట్‌ కార్డులు విడుదల


అమరావతి, 29 జూలై (హి.స.)

దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్‌ పీజీ 2025 పరీక్ష మరో వారంలో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) చకచకా ఏర్పాట్లు చేస్తుంది. దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆగస్టు 3న నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రోజున ఉదయం 9 గంటల నుంచి 12.30 గంటల వరకు జరిగే ఈ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు 4 రోజుల ముందు అంటే జులై 31వ తేదీన అడ్మిట్‌ కార్డులను వెబ్‌సైట్‌లోకి అందుబాటులోకి తీసుకువస్తారు.

పరీక్ష రోజున విద్యార్థులను 45 నిమిషాలకు ముందే ఎగ్జామ్‌ సెంటర్లలోకి అనుమతిస్తారు. దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మందికిపైగా విద్యార్థులు నీట్‌ పీజీ రాయనున్నారు. పరీక్షల అనంతరం సెప్టెంబర్‌ 3 నాటికి ఫలితాలను విడుదల చేయనున్నట్లు మెడికల్‌ బోర్డు తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande