పులివెందుల ఒంటిమిట్ట జెడ్ పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ విడుదల
అమరావతి, 29 జూలై (హి.స.) , కడప- కడప ఏడురోడ్లు, పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. పులివెందుల జడ్పీటీసీ సభ్యుడు మహేశ్వర్‌రెడ్డి దాదాపు మూడేళ్ల క్రితం చోటుచేసుక
పులివెందుల ఒంటిమిట్ట జెడ్ పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ విడుదల


అమరావతి, 29 జూలై (హి.స.)

, కడప- కడప ఏడురోడ్లు, పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. పులివెందుల జడ్పీటీసీ సభ్యుడు మహేశ్వర్‌రెడ్డి దాదాపు మూడేళ్ల క్రితం చోటుచేసుకున్న ఓ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానంతో పాటు జడ్పీ ఛైర్మన్‌ పదవులకు గత ఏడాది జూన్‌ 7న రాజీనామా చేయాల్సి వచ్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande