పర్యాటకులకు బిగ్ అలర్ట్.. శ్రీశైలం 5 గేట్లు ఎత్తివేత
శ్రీశైలం, 29 జూలై (హి.స.)కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది (Krishna river)తో పాటు దాని ఉపనదులు భారీ వరద వచ్చి చేరుతుంది. శ్రీశైలం ఎగువన ఉన్న తుంగభద్ర, జూరాల ప్రాజెక్టుల (Jurala Project) గేట్లను ఎత్తిన అధికారులు (Officers) నీట
పర్యాటకులకు బిగ్ అలర్ట్.. శ్రీశైలం 5 గేట్లు ఎత్తివేత


శ్రీశైలం, 29 జూలై (హి.స.)కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది (Krishna river)తో పాటు దాని ఉపనదులు భారీ వరద వచ్చి చేరుతుంది. శ్రీశైలం ఎగువన ఉన్న తుంగభద్ర, జూరాల ప్రాజెక్టుల (Jurala Project) గేట్లను ఎత్తిన అధికారులు (Officers) నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణ నదిపై ఉన్న శ్రీశైలం జలాశయానికి (Srisailam Reservoir) భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో అప్రమత్తం అయిన అధికారులు నిన్నటి మూడు గేట్లకు.. మరో రెండు గేట్లను కలిపి మొత్తం 5 గేట్లను (5 gates lifted) 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఎగువ నుంచి 2,32,290 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఐదు గేట్లు, కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా.. 2,01,743 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం (Srisailam full water level) 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులకు చేరింది. అయితే ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని గంట గంటకు పరిశీలిస్తున్న అధికారులు వరద ప్రవాహం పెరిగితే మరో గేటును ఎత్తేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande