అర్ధరాత్రి స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే.. పోలీసులపై ఫైర్
అమరావతి, 29 జూలై (హి.స.)పోలీసుల తీరుపై ఎమ్మెల్యే కోటంరెడ్డి (MLA Kotam Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. నిన్న రాత్రి ఇద్దరు దంపతులు బైక్ పై వెళ్తుండగా.. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా.. పాజిటివ్ వచ్చింది. దీంతో పోలీసుల
అర్ధరాత్రి స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే.. పోలీసులపై ఫైర్


అమరావతి, 29 జూలై (హి.స.)పోలీసుల తీరుపై ఎమ్మెల్యే కోటంరెడ్డి (MLA Kotam Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. నిన్న రాత్రి ఇద్దరు దంపతులు బైక్ పై వెళ్తుండగా.. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా.. పాజిటివ్ వచ్చింది. దీంతో పోలీసులు వారి నుంచి బైక్ తీసుకొని.. డ్రంక్ అండ్ డ్రైవ్ కింద రూ.10 వేలు ఫైన్ చెల్లించాలని తెలిపారు. వారు తమ వద్ద అంత డబ్బు లేదని చెప్పడంతో.. నడిరోడ్డుపై వారిని వదిలేసి బైకు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అర్ధరాత్రి నడిరోడ్డుపై బిక్కుబిక్కుమంటూ దంపతులు నిల్చుండి పోయారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి అర్ధరాత్రి స్పందించి.. అక్కడికి చేరుకుని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారిపై పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం పోలీసులు దంపతుల బైక్ ఇవ్వగా వారు.. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు.. అర్ధరాత్రి సామాన్య దంపతులను ఆదుకున్నందకు ఎమ్మెల్యే పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande