ముగిసిన సి ఏం.చంద్రబాబు సింగపూర్ పర్యటన
అమరావతి, 30 జూలై (హి.స.) ,సింగపూర్‌లోని తెలుగు ప్రజల అత్మీయ స్వాగతం.. ప్రేమాభిమానాలు మరువలేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సింగపూర్ పర్యటన ముగించుకుని బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరారు. అంతక
ముగిసిన సి ఏం.చంద్రబాబు  సింగపూర్ పర్యటన


అమరావతి, 30 జూలై (హి.స.)

,సింగపూర్‌లోని తెలుగు ప్రజల అత్మీయ స్వాగతం.. ప్రేమాభిమానాలు మరువలేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సింగపూర్ పర్యటన ముగించుకుని బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరారు. అంతకు ముందు ఆయన బస చేసిన హోటల్‌కు సింగపూర్‌లోని తెలుగు ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు. వారితో ఆయన ముచ్చటించారు.

ఈ సందర్భంగా వారికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన సింగపూర్‌లోని ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. ఆయనకు వీడ్కోలు పలికేందుకు స్థానిక అధికారులతోపాటు తెలుగు ప్రజలు ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో జై సీబీఎన్ అంటూ తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande