ఉగ్రవాదులు ముందే దొరికినా కావాలనే దాచిపెట్టారా? : సీపీఐ నారాయణ
న్యూఢిల్లీ, 30 జూలై (హి.స.) అబద్దాలు చెప్పడంలో ప్రధాని నరేంద్ర మోడీ , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిట్ట అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. అబద్ధాలు చెప్పేవారిలో గోబెల్స్ మొదటి వారని, అయితే ఆయనను మనం ఎవ్వరం చూడలేదు కానీ మోడీ, కేసీఆర్ ను చూ
సిపిఐ నారాయణ


న్యూఢిల్లీ, 30 జూలై (హి.స.) అబద్దాలు చెప్పడంలో ప్రధాని

నరేంద్ర మోడీ , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిట్ట అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. అబద్ధాలు చెప్పేవారిలో గోబెల్స్ మొదటి వారని, అయితే ఆయనను మనం ఎవ్వరం చూడలేదు కానీ మోడీ, కేసీఆర్ ను చూస్తున్నామన్నారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రతి ఘటనను రాజకీయ లబ్ధికోసం వాడుకుంటోందని బరితెగించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నప్పుడే పహెల్గాం టెర్రరిస్టులు హతమయ్యారని వార్తలు వచ్చాయి. ముందే ఉగ్రవాదులు దొరికినా ఇప్పటి వరకు కావాలనే దాచిపెట్టారా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాల సహకారం తీసుకుని టెర్రరిజాన్ని అంతం చేయాలన్నారు. అమర్ నాథ్ యాత్రకు 7.50 లక్షల మంది భద్రతా బలగాలు ఉన్నాయని బలగాలు ఉండగానే ఉగ్రదాడులు ఎలా జరిగాయని ప్రశ్నించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన వారికి కోటి రూపాయలు పరిహారం ఇస్తే పహెల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన వారికి లక్ష మాత్రమే పరిహారం ఇస్తున్నారని మండిపడ్డారు. పహెల్గాం ఉగ్రదాడిని బీజేపీ రాజకీయాలకు వాడుకుంటోందని ఇది శవాల మీద పేలాలు ఏరుకోవడమేనని ఎద్దేవా చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande