ఢిల్లీలో 8 కొత్త పోలీస్ భవనాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
న్యూఢిల్లీ, 30 జూలై (హి.స.) పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల ఢిల్లీలో నిర్మించిన 8 కొత్త ఢిల్లీ పోలీస్ భవనాలను ఈ రోజు ఆయన పోలీస్ అధికారులు, స్థానిక మంత్రులతో కలిస
బండి సంజయ్


న్యూఢిల్లీ, 30 జూలై (హి.స.)

పార్లమెంట్ సమావేశాల్లో

భాగంగా ఢిల్లీలో ఉన్న కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల ఢిల్లీలో నిర్మించిన 8 కొత్త ఢిల్లీ పోలీస్ భవనాలను ఈ రోజు ఆయన పోలీస్ అధికారులు, స్థానిక మంత్రులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ పోలీసులకు అధునాతన కార్యాలయాలు నిర్మించడం.. భారత ప్రధాని నరేంద్ర మోడీ దూరదృష్టి గల నాయకత్వాన్ని, అంతర్గత భద్రతా మౌలిక సదుపాయాలను ఆధునీకరించడంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా యొక్క వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని ప్రతిబింబిస్తాయని కొనియాడారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande